- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో వైరస్ కంట్రోల్‌లోనే ఉందంటా
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా అదుపులోనే ఉన్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో ఊహించినదాని కంటే పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయని వివరించారు. కరోనా పేషెంట్ల రికవరీలు పెరుగుతున్నాయని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. జూన్ చివరికల్లా ఢిల్లీలో కరోనా కేసులు సుమారు లక్షకు చేరువవుతాయని, అందులో 60వేలు యాక్టివ్ కేసులుగా ఉంటాయన్న అంచనాలు గతంలో ఉన్నాయని చెప్పారు.
అయితే, ప్రతిఒక్కరి కృషి వల్ల పరిస్థితులు అదుపులోకి వచ్చాయని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 26వేల యాక్టివ్ కేసులే ఉన్నాయని తెలిపారు. కొన్ని రోజులుగా ఢిల్లీ వేగంగా కుదురుకుంటున్నదని పేర్కొన్నారు. అయితే, ఎవ్వరూ అలసత్వం వహించడానికి వీల్లేదని, ఈ మహమ్మారి ఎప్పుడైనా మళ్లీ తిరగబెట్టవచ్చునని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టుల సంఖ్యను పెంచామని, గతంతో పోల్చితే ప్రతి వంద శాంపిళ్లకు అప్పుడు 31 పాజిటివ్ రాగా, నేడు 13 నమూనాలే వైరస్ పాజిటివ్‌గా వస్తున్నాయని వివరించారు. అత్యధిక కేసుల జాబితాలో ఢిల్లీ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 87,360 కరోనా కేసులున్నాయి.