- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘గ్రేటర్’ ముహూర్తాన పరిమళిస్తున్న ‘కమలం’
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ కార్పొరేటర్లు కమలం వైపు మళ్లుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో విభేదాలున్నవారు, స్థానికంగా గ్రూపు రాజకీయాలతో విసిగిన వారు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు మరికొందరు పార్టీలో గ్రూపు రాజకీయాలతో విసిగిపోయి గులాబీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. తమతమ నియోజకవర్గాల బీజేపీ ఇన్ చార్జీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ శివారు ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు కాషాయం నీడకు చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరికి తోడు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారు ఈసారి బీజేపీ నుంచి పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు తమ వారసులను రంగంలోకి దింపుతుండటంతో ఆ డివిజన్లకు చెందిన నాయకులు సైతం బీజేపీ వైపు తిరిగే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వలసలు మొదలవుతాయని టీఆర్ఎస్ వర్గాలే పేర్కొంటున్నాయి.
రాజేంద్రనగర్‌లో..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గత సోమవారమే మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ కాషాయం గూటికి చేరారు. ఆయన మరో ఇద్దరు సైతం బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. గతంలో నేరుగా అధిష్టానం మద్దతున్న ఆయనకు ఇటీవల తగ్గించడంతో పాటు తన వర్గానికి ఎమ్మెల్యే ప్రాధాన్యతనివ్వడంలేదని ఎంతకాలం ఇలా భరించాలనే నిరుత్సాహంతో పార్టీ మారినట్లు అక్కడ చర్చ జరుగుతుంది. తాను తీసుకొచ్చే మరో ఇద్దరు కార్పొరేటర్లను సైతం గెలిపించుకునే బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పుకుంటున్నారు. ఆయనకు స్థానికంగా బలమైనవర్గం ఉన్నట్లు పేరున్నదని టీఆర్ఎస్ వర్గాలే వెల్లడిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచినా ఆయన టీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయనకు దీటుగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. ఆయనను దూరం చేసుకోవడం అధికార పార్టీకి కొంత ఇబ్బందేనని వారంటున్నారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ నుంచి టిక్కెట్టు రాదనే ప్రచారమున్నదని, అయితే వారు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది.
ఎల్బీనగర్‌లో..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టిక్కెట్టు రాని పక్షంలో బీజీపీ నుంచి పోటీచేసేందుకు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఓ కార్పొరేటర్‌పై నమోదైన కేసు విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నందున బీజేపీలో చేరాలనే యోచన చేస్తున్నట్టు చర్చకు తెరలేచింది. ఇంకో కార్పొరేటర్ కూడా తనకు టిక్కెట్టు ఇవ్వడంపై ఆశలు సన్నగిల్లుతున్నాయని కాషాయం వైపు దృష్టిసారించినట్టు స్థానికంగా గుసగుసలు మొదలయ్యాయి. ఇద్దరు కార్పొరేటర్లు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారనేది బహిరంగ రహస్యం.
ఉప్పల్‌లో..
ఉప్పల్ నియోజకవర్గంలో ముగ్గురు కార్పొరేటర్లు పార్టీని వీడే అవకాశాలున్నాయి. అందులో ఓ కార్పొరేటర్ కు టిక్కెట్టు ఇచ్చేది లేదని ఎమ్మెల్యే ఈపాటికే తన అనుచరులకు సంకేతాలు పాస్ చేసినట్టు చర్చ జరుగుతుంది. మరో కార్పొరేటర్ వేరే పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరారని, అక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిన నాయకుడికే మళ్లీ టిక్కెట్టు ఇవ్వాలనే యోచనలో ఎమ్మెల్యే ఉన్నట్టు నియోజకవర్గంలో ప్రచారమున్నది. అయితే, పార్టీలో చేరిన కార్పొరేటర్తన ప్రత్యర్థి వర్గానికి చెందినవాడనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్టు పార్టీలో గుసగుసలున్నాయి. ఓ మహిళా కార్పొరేటర్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నానని ఈపాటికే చెప్పడంతో ఆమె బీజేపీకి వెళ్తారా..? అనే చర్చకు తెరలేచింది.
మల్కాజిగిరిలో..
మల్కాజిగిరిలో నలుగురు సిట్టింగ్ లను మార్చే యోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే తన అనుయాయులకు సంకేతాలిచ్చారు. వారు పార్టీ కార్యక్రమాలను చేసుకుంటున్నారనేది చర్చకు తెరలేచింది. దీంతో వారిలో ఇద్దరు మాత్రం బీజేపీ నాయకులను ఈ పాటికే సంప్రదింపులు జరిపినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ ఉన్నది. వారు కొంతకాలంగా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారనేది ఇక్కడ బహిరంగ రహస్యం. అయితే, మరో కార్పొరేటర్ కేసుల్లో ఉన్నందున ఆయనకు టిక్కెట్టు ఇవ్వరాదని ఎమ్మెల్యేకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తెలిపినట్టు చర్చ జరుగుతుంది. మరో కార్పొరేటర్ పై అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడంతో పాటు ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండడనే కోపంతో ఆయనను ఈసారి పక్కన పెట్టనున్నట్టు తెలిసింది. మొత్తం 3-4 మంది కార్పొరేటర్లను మార్చుతున్నట్టు ప్రచారం జోరందుకోవడంతో వారు సైతం పార్టీ మారేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని అధికార పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.