ములుగులో సిరిసిల్ల వాసి మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం

by Sridhar Babu |   ( Updated:2021-12-19 02:08:03.0  )
Mangapeta1
X

దిశ, మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం సమీపంలోని మార్కెట్ గోదాముల వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రశాంత్ తన బంధువులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బంధువుల పెళ్లికి కారులో వెళ్తుండగా కమలాపురం సమీపంలోని మార్కెట్ గోదాముల వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగిరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story