ఆపిల్ సిరి ద్వారా కరోనా అప్‌డేట్స్

by vinod kumar |
ఆపిల్ సిరి ద్వారా కరోనా అప్‌డేట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపిల్ సిరి ద్వారా కొవిడ్ 19 వైరస్‌కి సంబంధించిన తాజా సమాచారాన్ని ఆడియో న్యూస్ ద్వారా తెలుసుకునే ఫీచర్ భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. గత నెల మొదటగా అమెరికాలోని ఆపిల్ యూజర్ల కోసం సిరి అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత్‌లో కూడా కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండటంతో ఇక్కడ కూడా ఆపిల్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇండియాతో వైరస్ ప్రభావం ఉన్న చాలా దేశాల్లో ఈ ఫీచర్‌ను డిప్లాయ్ చేస్తున్నట్లు ఆపిల్ వెల్లడించింది.

ఈ కరోనా అప్‌డేట్ ఫీచర్ ద్వారా సిరి, నాకు కరోనా ఉందా? సిరి, నాకెందుకో కరోనా ఉన్నట్లు అనిపిస్తోంది… అనే ప్రశ్నలను ఇంగ్లిషులో అడగడం ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. మీ ప్రశ్నలకు ప్రతిగా ఒక్కొక్క లక్షణాన్ని సిరి అడిగి తెలుసుకుని మీరు డాక్టర్ సంప్రదించాలా వద్దా అని నిర్ణయిస్తుంది. అలాగే బీబీసీ వరల్డ్ ఇండియా సర్వీసు సాయంతో కరోనాకు సంబంధించిన తాజా సమాచారాన్ని సిరి ఆడియో ద్వారా తెలియజేసే సదుపాయం కూడా ఉంది.

Tags – corona, covid, apple, siri, covid updates, new feature

Advertisement

Next Story

Most Viewed