పప్పు శనగ కొనుగోలు కోటా పెంచండి

by Shyam |
పప్పు శనగ కొనుగోలు కోటా పెంచండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పప్పు శనగ కోటాను పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కోరారు. ఈ మేరకు సింగిరెడ్డి ఆదివారం కేంద్ర మంత్రికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో 1.89 లక్షల టన్నుల పప్పు శనగ దిగుబడి వస్తుందని అంచనాలుంటే 47వేల 600 టన్నుల కొనుగోలుకు మాత్రమే కేంద్రం అనుమతించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో శుక్రవారం వరకు 12,693 మంది రైతుల నుండి 19వేల876 టన్నులు క్వింటాలుకు రూ.4,875కు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గతంలో అనుమతించిన 47వేల 600 టన్నులు కాక మరో 27వేల830 టన్నుల పప్పు శనగ కొనుగోలుకు అనుమతించాలని కోరారు. ఈ లెక్కన చూసినా రాష్ట్రంలో పండిన మొత్తం పంటలో 40 శాతం మాత్రమే మద్దతు ధరకు సేకరించినట్లవుతుందని తెలిపారు. తెలంగాణ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ విషయపై వెంటనే నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేయాలని సింగిరెడ్డి కేంద్ర మంత్రిని లేఖలో రిక్వెస్ట్ చేశారు.

Tags: telangana, agriculture minister, chana dal, central agriculture ministry, procurement, msp

Advertisement

Next Story