సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్.. వరుడు అతడే !

by Shyam |
సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్.. వరుడు అతడే !
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీఫుల్ సింగర్ సునీత రెండో పెళ్లిపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది. ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఆమె రెండో పెళ్లికి ఓకే చెప్పారు. సోమవారం ఉదయం ఎంగేజ్‌మెంట్ సైతం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిపోయింది. కొద్దిరోజుల క్రితం రెండో పెళ్లిపై ఓ ఛానల్‌లో అడిగిన ప్రశ్నకు తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని చెప్పిన స్వీట్ సింగర్.. రెండు నెలల వ్యవధిలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుండటం గమనార్హం.

ముందు నుంచి జరుగుతున్న ప్రచారం ప్రకారం డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న బిజినెస్‌మెన్ రామ్ వీరపనేనితోనే సునీత నిశ్చితార్థం జరిగింది. రామ్ వీరపనేనికి సైతం రెండో పెళ్లి అన్నట్లుగా తెలుస్తోంది. 15 ఏళ్ల వయస్సుల్లో టాలీవుడ్‌లో పాటల ప్రస్థానాన్ని ప్రారంభించిన సునీత.. 19 ఏళ్లకు వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విభేదాలు రావడంతో డైవర్స్ తీసుకున్నారు. దాదాపు 12ఏళ్ల నుంచి పిల్లలతో కలిసి ఉంటున్న సునీత.. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దల సూచనతో రెండో పెళ్లికి రెడీ అయ్యారు.

సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ దూసుకెళ్తున్న సునీత భర్తతో విడిపోయి దూరంగా ఉంటుందన్న విషయం ఆమె సన్నిహితులకు తప్ప ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. ఇటీవల ఛానల్‌ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్న అడిగిన సమయంలోనే షాకింగ్‌కు గురైన ఆమె ఫ్యాన్స్‌ అసలు విషయం తెలుసుకున్నారు. ప్రస్తుతం సునీత ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ వైరల్ అవుతుండగా.. తెలుగు ప్రేక్షకులు, ఆమె ఫ్యాన్స్‌కు విషెస్ తెలుపుతున్నారు.

సింగర్ సునీతకు కాబోయే భర్త ‘మ్యాంగ్ యూ ట్యూబ్ ఛానల్‌’ను రన్ చేస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈనెల 9న ఓ టెంపుల్‌లో కొద్దిమంది సమక్షంలోనే పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed