- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంటిలేటర్‌పైనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం : ఎస్పీ చరణ్
దిశ, వెబ్‌డెస్క్ : తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ అన్నారు. కరోనా సోకడంతో ఆయన చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఎస్పీబీ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. వెంటిలేటర్ తొలగించారని వస్తున్న కథనాల్లో నిజం లేదని.. ఆరోజు రావాలని కోరుకుంటున్నట్లు వివరించాడు.
వీడియో సందేశంలో ‘నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. నిన్న ఏలా ఉందో ఇవాళ కూడా అలాగే ఉంది. నాన్నకు వెంటిలేటర్ తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆ రోజు రావాలని మేమూ ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం’ అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, గాయకులు ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్ర 6గంటలకు యూనివర్సల్ మాస్ ప్రేయర్ పేరిట ఒకేసారి ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని నటుడు ఉత్తేజ్ ఆకాంక్షించారు.