మగబిడ్డకు జన్మనిచ్చిన ఫేమస్ సింగర్

by Jakkula Samataha |   ( Updated:2021-05-22 06:37:16.0  )
మగబిడ్డకు జన్మనిచ్చిన ఫేమస్ సింగర్
X

దిశ, సినిమా : సింగర్ శ్రేయా ఘోషల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. మార్చిలో బేబీ బంప్‌తో ప్రెగ్నెన్సీ ప్రకటించిన శ్రేయ.. ఈ రోజు మధ్యాహ్నం బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పినట్లు తెలిపింది. ఇంతకు ముందు లేని ఈ ఎమోషన్‌తో చాలా హ్యాపీగా ఉన్నామన్న సింగర్.. భర్త షీలాదిత్యతో పాటు కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఆమె.. ప్రేమ, ఆశీస్సులు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. త్వరలోనే బేబీ బాయ్ ఫొటోస్ షేర్ చేస్తానని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో స్టార్స్, ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు.

Tags: Shreya Ghoshal, Baby Boy, Singer, Bollywood, Tollywood
slug: Shreya Ghoshal Welcome Baby Boy

Advertisement

Next Story