- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రానికి సింగరేణి కార్మికుల వార్నింగ్
దిశ, తాండూర్: సింగరేణిలో ఈ నెల 9,10,11 తేదీలలో జరిగే సమ్మెను కార్మికులు విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, గుణపాఠం చెప్పాలని సింగరేణి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అబ్బాపూర్ బీపీఏ ఓసీపీ-2 లో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటికరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు ఇచ్చే నోటిఫికేషన్ వెంటనే రద్దు చేసి, ఆ బావులను సింగరేణికి యథావిథిగా ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో పోరాటాలు, ఆందోళనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ (జేఏసీ) నాయకులు శ్రీనివాస్, ప్రకాష్ రావు, తిరుపతి, సత్తయ్య, కృష్ణ మోహన్, శేషు, బయ్య మొగిలి, కోటేశ్వర్, రెడ్డి, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- central govt