- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి బోర్డు కీలక నిర్ణయాలు
దిశ, కరీంనగర్: కొత్త ప్రాజెక్టుల కోసం యంత్రాల కొనుగోలుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. యాజమాన్యం తీసుకుంటున్న కోవిడ్-19 నివారణ చర్యలపై బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది. సిఎండి ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డోర్లీ ఓ.సి.పి. విస్తరణ, జి.డి.కె.-7 ఎల్‌ఇపి ఓసి తదితర 5 ప్రాజెక్టుల ప్రణాళికలకు బోర్డు అంగీకారం తెలిపింది. అలాగే, వివిధ గనులకు అవసరమైన 25 కొత్త డంపర్ల కొనుగోలుకు బోర్డు మీటింగ్ అనుమతించింది.
కొత్తగూడెం ఏరియా పరిధిలోని జెవిఆర్ ఓసి2, మందమర్రి ఏరియా పరిధిలోని కెకెఓసి ప్రాజెక్టు ఓ.బి. కాంట్రాక్టు పనులకు బోర్డు అమోదం తెలిపింది. కోవిడ్-19 వ్యాధి విస్తరించకుండా యాజమాన్యం చేపడుతున్న శానిటైజేషన్, మాస్కుల పంపిణీ, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాట్లు, పోస్లర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. వర్కింగ్ ప్లేస్‌లో భౌతికదూరం పాటిస్తూ విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టడం తదితర విషయాలపై సి.ఎండి శ్రీధర్ వివరించగా బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది.