- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. మంత్రి లేకుండానే సిద్దిపేటలో సీక్రెట్ మీటింగ్..!
దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిద్దిపేట మున్సిపల్ తొలి మహిళా చైర్ పర్సన్‌గా కడవేరు మంజుల రాజనర్సు ఎన్నికయ్యారు. ఇటీవల చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన మొట్టమొదటి సమావేశం ఎలా జరుగుతుందో.. నూతన చైర్ పర్సన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అందరూ ఆతృతగా ఎదురుచూశారు. కానీ, అందుకు భిన్నంగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం కొనసాగింది. కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఎప్పుడూ పాల్గొనే మంత్రి హరీశ్ రావు సైతం సమావేశానికి హాజరు కాలేదు. ఇదిలా ఉండగా సభలో కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన మున్సిపల్ చైర్ పర్సన్ నిశ్శబ్దంగా ఉండగా.. ఆమె తరఫున సమాధానాలు మున్సిపల్ కమిషనర్ చెప్పినట్టు సమాచారం. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమావేశంలో చర్చించిన అంశాలు …
సిద్దిపేట మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరు మంజుల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సిద్దిపేట వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశంలో మొదట నిర్ణయించుకున్న 12 అంశలపై చర్చించి ఆమోదం తెలిపినట్టు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. సీఎం దళిత సాధికారిత పథకానికి సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లు కేటాయించడంపై కౌన్సిలర్లు సాకీ బాల్ లక్ష్మీ, నాయిని చంద్రంలు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 1 వ తేదీన జరిగే పట్టణ ప్రగతిపై చర్చించినట్టు సమాచారం.
మీడియాకు సమాచారం లేదు..
సోమవారం నిర్వహించిన సిద్దిపేట మున్సిపల్ సమావేశానికి మీడియాకు సమాచారం అందించలేదు. విషయం తెలుసుకొని సమావేశ మందిరానికి వెళ్లిన మీడియా సిబ్బందిని వారు అనుమతించలేదు. దీనిపై పలువురు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌన్సిలర్ల ప్రశ్నలకు కమిషనర్ సమాధానం..
ఏ పట్టణ సమావేశంలోనైనా కౌన్సిలర్లు అడిగే ప్రతి ప్రశ్నకు మున్సిపల్ చైర్మన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ, సిద్దిపేట మున్సిపాలిటీ అందుకు విరుద్ధం. దేశానికే ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట.. సమావేశ నిర్వహణలోనూ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్‌కు బదులు కమిషనరే సమాధానమిస్తారు. సోమవారం నిర్వహించిన సమావేశంలోనూ పలువురు కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ రమణచారియే సమాధానమిచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్‌కు ఈ ప్రాంత సమస్యలపై పూర్తిస్థాయి పట్టుంది. అందుకే రిటైర్డయ్యాక కూడా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొత్త కౌన్సిలర్లు కావడంతో వారు సైతం కమిషనర్ చెప్పిన సమాధానాలకు వేరే కొత్త ప్రశ్నలు వేయకుండా మౌనం వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
మంత్రి లేకుండానే..
సిద్దిపేటలో ఇటీవల కొలువుదీరిన నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొట్టమొదటి సమావేశం ఇదే. అయితే సిద్దిపేటలో జరిగే ప్రతి సమావేశానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరై కౌన్సిలర్లు సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చూపడం.. అప్పటికప్పుడు అధికారులను ఆదేశాలు జారీ చేయడం లాంటివి చేస్తారు. కానీ సోమవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరుకాకపోవడం వెనుక అంతర్యమేమిటంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నిన్న కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై దిశ పత్రిక ఇది సిద్దిపేట అభివృద్ధి అంటూ ప్రచురించింది. దీనిపై ఎవరైనా ప్రశ్నలు సంధిస్తారని రాలేదేమో అంటూ పలువురు ముచ్చటించుకున్నారు.
అంతర్గత సమావేశం వెనుక అంతర్యమేమిటీ..?
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఏ సమావేశానికైనా మీడియాకు సమాచారమిచ్చే వారు. సమావేశంలో అన్ని అంశాలను చర్చించే వారు. కానీ సోమవారం రోజున అకస్మాత్తుగా మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం వెనుక అంతర్యమేమిటంటూ పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా సిద్దిపేట పట్టణంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పలు కాలనీల్లో ఇండ్లలోకి చేరిన నీరు, యూజీడీ పనుల తీరుపై చర్చించేందుకు మాత్రమే రహస్యంగా మున్సిపల్ పాలక వర్గం సమావేశమైందనే చర్చ సిద్దిపేటలో జోరుగా కొనసాగుతుంది. దీనిపై మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ఏం సమాధానం చెబుతారో చూడాలి. మొత్తానికి సిద్దిపేట మున్సిపల్ మొట్టమొదటి సమావేశమే ఇలా ఉంటే రాబోయే కాలంలో ఎలా ఉంటుందోనని, ఇక మన సమస్యలు పరిష్కారమయ్యేనా అంటూ పలువురు ముచ్చటించుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్ పర్సన్ స్పందించి వార్డుల్లో తిరుగుతూ వార్డు సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.