- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సరస్వతి ఆలయాన్ని సందర్శించిన సిద్దిపేట నూతన కలెక్టర్
by Shyam |

X
దిశ, గజ్వేల్ : సిద్దిపేట నూతన కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఉదయం వర్గల్ మండల కేంద్రంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదవీ భాధ్యతల స్వీకరణ చేయనున్న సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్నట్లు ఆయన చెప్పారు. అమ్మవారి కృపతో జిల్లాలో విశిష్ట పాలన అందించి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తానని తెలిపారు. కాగా, ఆలయాన్ని దర్శించుకున్న నూతన కలెక్టర్ కు ఆలయ పండితులు, పురోహితులు వేద మంత్రోచ్ఛరణలతో సాదర స్వాగతం పలికారు. పూజ అనంతరం అమ్మవారి తీర్థ,ప్రసాదాలను కలెక్టర్ స్వీకరించారు.
Next Story