కలెక్టర్ స్పందనకు వందనం.. గంటల్లోనే దివ్యాంగుడి సమస్య పరిష్కారం

by Shyam |
Collector Hanumantrao
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కలెక్టర్ అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఓ సమావేశం ముగిసిన అనంతరం తన ఛాంబర్‌కు వెళుతున్నారు. అంతలోనే బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన 55 సంవత్సాల దివ్యాంగుడు దండ్ల దుర్గయ్య కలెక్టర్ యం.హనుమంతరావును ఆపాడు. తన సమస్యలను చెబుతూ తనకు మూడు చక్రాల వాహనం కావాలని అడిగాడు. ఓపిగ్గా వృద్ధుడి సమస్యలను విన్న కలెక్టర్ ట్రై సైకిల్ అందిస్తానని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే జిల్లా సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డితో మాట్లాడారు. వెంటనే దివ్యాంగుడు దండ్ల దుర్గయ్య మూడు చక్రాల వాహనం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్ ఆదేశాలతో జిల్లా సంక్షేమ అధికారి గురువారం సాయంత్రం మూడు చక్రాల బండిని దండ్ల దుర్గయ్యకు అందజేశారు. అడిగిన వెంటనే ట్రై సైకిల్ అందజేసిన కలెక్టర్‌కు, జిల్లా సంక్షేమ అధికారికి దుర్గయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story