- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల అదుపులో ‘కర్ణాటక మాజీ సీఎం’
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గుండు రావు, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ.. ర్యాలీగా వెళ్లి సీఎం బీఎస్ యడ్యూరప్ప కార్యాలయ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి ప్రధాని మోడీని కించపరుస్తూ బీదర్‌లో పాఠశాల విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ నాటకానికి సహకరించినందుకు ఓ విద్యార్థి తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై నమోదు చేసిన దేశద్రోహం కేసుకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ ఈ ర్యాలీని చేపట్టింది. కాగా పోలీసుల చర్యను కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అప్రజాస్వామికమని అన్నారు. ‘మా హక్కులను హరించే అధికారం పోలీసులకు లేదని’ మండిపడ్డారు.