భద్రాచలంలో ‘నో మాస్క్’.. 19 మందికి షాకిచ్చిన పోలీసులు

by Sumithra |
భద్రాచలంలో ‘నో మాస్క్’.. 19 మందికి షాకిచ్చిన పోలీసులు
X

దిశ, భద్రాచలం అర్బన్ : కరోనా మహమ్మారిని నివారించేందుకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని భద్రాచలం ట్రాఫిక్ SI శ్రీపతి తిరుపతి తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం టౌన్‌లో గల స్థానిక అయ్యప్ప స్వామి గుడి ఎదుట వాహన చోదకులకు కరోనా నియంత్రణ పై అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్క్ ధరిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసిందన్నారు. ఈ సందర్భంగా మాస్క్ ధరించకుండా సంచరిస్తున్న 19 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. అదే విధంగా వాహనదారులు తమ పెండింగు చలాన్లను వెంటనే చెల్లించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed