- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన SI
by Sumithra |
X
దిశ, పరిగి : గొడవ విషయంలో లంచం తీసుకుంటుండగా పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి, సురేష్ అనే వ్యక్తులు వారం రోజుల క్రితం గొడవ పడ్డారు.
ఈ విషయమై స్థానికంగా పంచాయితీ పెట్టి ఇరువురూ రాజీ కుదుర్చుకున్నారు. ఈ గొడవ విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్.. తనకు 10వేలు లంచం ఇవ్వాలంటూ సాయిరెడ్డిని డిమాండ్ చేశారు. సాయిరెడ్డి ఈ విషయం గురించి తన బాబాయ్ పరశురామ్ రెడ్డికి తెలియజేశారు.
పథకం ప్రకారం ఏసీబీని ఆశ్రయించిన వీరు.. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఎస్‌ఐని పట్టించారు. అనంతరం ఎస్ఐ క్రాంతి కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
Advertisement
Next Story