- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేరుతో ఎస్సై పైశాచికత్వం..
దిశ, వాజేడు : ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన రాందేని వేణు అనే యువకుడు ఉదయం 11 గంటల ప్రాంతంలో రామన్నగూడెం రామాలయం వద్ద ఉన్న మిర్చి కళ్ళం వద్దకు కాపలా వెళ్లాడు. అక్కడికి వచ్చని ఏటూరునాగారం ఎస్సై శ్రీకాంత్ రెడ్డి వేణు ని నీకు మాస్కు ఏది రా అని చర్మం పగిలి పోయేలా ఎక్కడపడితే అక్కడ మోటార్ కు వాడే పైపుతో విచక్షణా రహితంగా చితకబాదాడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఈ సంఘటన బయటకు రాకుండా, తనకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి వీడియో తీసినట్లు సమాచారం.
తమ తప్పే ఉందని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని, లేకుండా వేణుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతానని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి బెదిరించినట్లు వేణు తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భక్షించేలా తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తూ యువకుడిని చితకబాదిన సంఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది ఆకారణంగా తమ కుమారుడు వేణును చితకబాదిన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని తండ్రి రాందేని శ్రీనివాస్ కోరుతున్నారు.