శుభమన్‌గిల్ రెడ్ కర్చీఫ్ వెనుక స్టోరీ ఏంటి..?

by Shyam |
Shubman Gill reveals the story behind his red handkerchief
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ టెస్టు జట్టుతో పాటు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌గా భారత జట్టు సేవలందిస్తున్న శుభమన్‌గిల్ అనతి కాలంలోనే నమ్మదగిన బ్యాట్స్‌మాన్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌లో కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా నడుముకు ఎర్ర కర్చీప్ దోపుకొని కనిపిస్తున్నాడు. అసలు ఆ రెడ్ కర్చీప్ వెను స్టోరీ ఏంటా అని అందరూ చాలా కాలంగా అడుగుతున్నారు. తాజాగా ఆదివారం దాని వెనుక కారణాన్ని చెప్పాడు. ‘క్రికెట్ ఆడుతున్న మొదటి నుంచి ఆ కర్చిప్ అలా దోపుకొని లేను.

అయితే టీమ్ ఇండియా అండర్ 19 తరపున ఆడుతున్నప్పుడు ఒకసారి అనుకోకుండా ఎర్ర కర్చిప్ పెట్టుకొని ఆడాను. అప్పటి నుంచి తాను మంచిగా పెర్ఫామ్ చేస్తున్నట్లు గుర్తించాను. దాంతో ఆ కర్చిప్ అలా పెట్టుకోవడం అలవాటు అయ్యింది. మేము ఎక్కువగా ఎర్రబంతి క్రికెట్ ఆడాము. కేవలం అండర్-19 నుంచి మాత్రమే అలా ఎర్ర కర్చీప్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎర్ర బంతితో ఆడే సమయంలో రెడ్ కలర్ కర్చీప్ పెట్టుకోవడానికి అంపైర్లు అనుమతించరు. అందుకే కేవలం వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రమే అలా ధరిస్తున్నాను’ అని శుభమన్ గిల్ చెప్పాడు.

Advertisement

Next Story