డియరెస్ట్ డాడీ.. హ్యాపీ ఫాదర్స్ డే : శ్రుతిహాసన్

by Shyam |
Shruti-Haasan,-Kamal-Haasan
X

దిశ, సినిమా: సౌత్‌ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ పాపులర్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అప్‌డేట్ చేస్తుండే శ్రుతి.. నేడు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి కమల్ హాసన్‌కు స్పెషల్ మెసేజ్‌తో విషెస్ తెలిపింది. కమల్‌తో తన హ్యాపీ మూమెంట్ పిక్ షేర్ చేసిన యాక్ట్రెస్.. హార్ట్ టచింగ్ క్యాప్షన్ యాడ్ చేసింది. మీరు ఎవరి నుంచి ఎక్కువగా నేర్చుకుంటారో, మిమ్మల్ని ఎవరు బాగా నవ్విస్తారో.. తనే మీ తండ్రి అయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరని చెప్తూ కమల్‌కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పింది. తన డియరెస్ట్ డాడీగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపిన రాక్‌స్టార్.. తండ్రీ కూతుళ్లు ఇద్దరూ ఫన్ మూమెంట్‌లో క్రేజీగా కనిపిస్తున్న క్యూట్‌ పిక్ షేర్ చేసింది.

ఇక రీసెంట్‌గా ‘వకీల్‌సాబ్’ మూవీలో కనిపించిన మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్.. ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘సలార్’లో నటిస్తోంది. అంతేకాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న తమిళ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘లాభం’లోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.

Advertisement

Next Story