శ్రీయ నుంచి రక్షించాలంటున్న భర్త

by  |   ( Updated:2023-04-14 05:28:36.0  )
ShriyaSaran
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీయా శరణ్… టాలీవుడ్‌ను ఏలేసిన కథానాయికల్లో ఆమె ఒకరు. క్యూట్ లుక్స్.. ప్రెట్టీ ఎక్స్‌ప్రెషన్స్… మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో కెరియర్ స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేసిన భామ… స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను ఎంజాయ్ చేసింది. ఒకప్పుడు త్రిషకు కూడా గట్టిపోటీ ఇచ్చిన భామ… ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో.. భర్త ఆండ్రీతో కలిసి క్వారెంటైన్‌ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

ఇంతకు ముందు భర్తతో అంట్లు తోమిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన శ్రీయా… తన భర్త మాదిరిగా మీరు కూడా మీ ఇంట్లో పనిచేయాలని పలువురు హీరోలకు చాలెంజ్ విసిరింది. ఈ వీడియో వైరల్ అయిన కొన్ని రోజుల్లోనే మరో వీడియోతో ముందుకొచ్చింది శ్రీయా. ఇందులో తన భార్య పెట్టే కష్టాలను ఫన్నీ వేలో ప్రెజెంట్ చేశాడు ఆండ్రీ.

ఈ వీడియోలో ముందుగా శ్రీయ సామాజిక దూరం పాటించాలని ప్రజలను కోరుతూ సైన్ బోర్డు చూపిస్తుంది. వెంటనే భర్త ఆండ్రీ తన వెనకాలే వచ్చేసి… తను నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంది అంటూ బోర్డు చూపిస్తాడు. ఆ తర్వాత శ్రీయా విరామం లేకుండా పని చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపగా… నాతో విశ్రాంతి లేకుండా పనిచేయిస్తుందని తన గోడును సైన్ బోర్డు ద్వారా వెళ్లబోసుకున్నాడు. ఇంట్లోనే ఉండాలని అందాల తార ప్రేక్షకులను కోరుతుంటే… ప్లీజ్ ఆమె నుంచి నన్ను రక్షించండి అని మొరపెట్టుకున్నాడు ఆండ్రీ. మొత్తానికి ఈ భార్యాభర్తల ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగా … వీరి దాంపత్య జీవనం ఇలాగే ఫన్నీగా సాగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్స్.


Advertisement

Next Story

Most Viewed