రాక్షసుల మధ్య తిరుగుతున్నాం.. శ్రద్ధ ఆవేదన

by Shyam |
రాక్షసుల మధ్య తిరుగుతున్నాం.. శ్రద్ధ ఆవేదన
X

తాజాగా కేరళలో జరిగిన సంఘటన క్రూరమైనదని ఆవేదన వ్యక్తం చేసింది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు ఆహారం ఆశజూపిన కొందరు రాక్షసులు.. పైనాపిల్‌లో క్రాకర్స్ పెట్టి ఏనుగుకు అందించారు. ఆకలితో ఉన్న ఏనుగు ఆ పైనాపిల్‌ను నోట్లో పెట్టుకోగానే అందులోని క్రాకర్స్ పేలాయి. ఈ ఘటనలో ఏనుగుకు తీవ్ర గాయాలు కాగా.. ఆ బాధతోనే ఊరంతా తిరిగింది. గాయాల బాధను తట్టుకోలేక చివరకు ఒక నదిలో నిలబడి కన్నుమూసిందని బాధపడింది శ్రద్ధ. ‘రాక్షసులంటే తలలపై కొమ్ములుంటాయని అనుకున్నా కానీ.. ఈ ఘటన తర్వాత అర్థమైంది రాక్షసులు మన పక్కనే నడుస్తారని’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చాలా జంతువులు మనుషులు సహాయం చేస్తాయని నమ్ముతాయి.. ఎందుకంటే అవి ఇంతకు ముందు మనకు హెల్ప్ చేసి ఉంటాయి. కానీ, ఈ ఘటన వెలకట్టలేనంత క్రూరమైనదని. దయ, జాలి లాంటివి లేనప్పుడు మనుషులుగా పిలిపించుకునే అర్హత లేనట్టే’ అని చెప్పింది. కఠిన చట్టాలు చేయడం కాదు.. వాటి అమలు చేయడమే చాలా ముఖ్యమని, ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని లేదంటే ఇలాంటి దారుణాలు ఆగవని కోరింది సాహో భామ.

https://www.instagram.com/p/CA9qLe8p6yA/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story