ఎస్వీబీసీలో మరో నలుగురికి షోకాజ్ నోటీసులు

by srinivas |
ఎస్వీబీసీలో మరో నలుగురికి షోకాజ్ నోటీసులు
X

దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల ఓ భక్తుడికి అశ్లీల వీడియోలు షేర్​చేసిన ఘటనపై టీటీడీ సోమవారం ఐదుగురు ఉద్యోగులను తొలగించింది. మరో నలుగురికి షోకాజ్​నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన వెలుగు చూసిన తొలిరోజునే ఒకర్ని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్​డిజైనర్లపై వేటేశారు. మేనేజరు స్థాయి ఉద్యోగులు నలుగురికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు.

Advertisement

Next Story