- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘షీ’ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నారు. కంపెనీ సీఈవోలుగా సంస్థ బాధ్యతను తమ భుజస్కందాల మీద వేసుకుని పోటీ ప్రపంచంలో మేటిగా నిలబెడుతున్నారు. అత్యున్నత పదవుల్లో కొనసాగుతూ ఆ పదవులకే వన్నె తెస్తున్నారు. ఎంట్రప్రెన్యూర్స్‌గానూ రాణిస్తున్నారు. కుటుంబాన్ని నడిపించడమే కాదు, పలు దేశాలకు అధ్యక్షులుగానూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇలా సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే స్థాయికి చేరుకున్నారు. చైతన్యవంతమైన మహిళ.. సమాజ, కుటుంబ స్థితిగతులనూ మార్చగలిగే శక్తియుక్తులున్న మహిళ.. సమాజ అభివృద్ధికి పాటుపడాలంటే ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్’ అనివార్యం. ఈ అంశం నేపథ్యంలోనే కేరళ, కొల్లంకు చెందిన ‘జటాయువు రామ కల్చరల్ సెంటర్’ షార్ట్ ఫిల్మ్స్ ఆహ్వానిస్తోంది.
‘మహిళా సాధికారిత’ నేపథ్యంలోనే షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించాల్సి ఉంటుంది. లఘు చిత్ర నిడివి మూడు నుంచి ఐదు నిమిషాల లోపు ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్‌గా ఎన్నికైన మూడు చిత్రాలకు రూ. 50వేలు, 25వేలు, 10 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుంది. అంతేకాకుండా బెస్ట్ డైరెక్షన్, కంటెంట్, యాక్టింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీలకు ప్రత్యేకంగా క్యాష్ ప్రైజెస్ (రూ. పదివేలు) ఉన్నాయి. హెచ్‌డీ క్వాలిటీతో మాత్రమే సినిమాలు రూపొందించాలి. జనవరి 15, 2021 వరకు సినిమాలను సెండ్ చేయాలి.
అఫిషియల్ ట్రైలర్, పోస్టర్, సినాప్సిసిస్‌లను నిర్వాహకులకు పంపించాలి. ఆన్‌లైన్‌లోనే న్యాయనిర్ణేతలు షార్ట్ ఫిల్మ్ విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తారు. విజేత వివరాలను ఈమెయిల్ చేయడంతో పాటు, జటాయువు రామ టెంపుల్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్ వాల్‌పై అనౌన్స్ చేస్తారు. మిగతా వివరాల కోసం website www.jatayuramatemple.in. Phone: 9778065168. సంప్రదించొచ్చు.