కరోనా వ్యాప్తి..మధ్యాహ్నం వరకే కిరణా షాప్స్

by Sridhar Babu |   ( Updated:2022-08-31 14:11:56.0  )
కరోనా వ్యాప్తి..మధ్యాహ్నం వరకే కిరణా షాప్స్
X

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కిరాణా దుకాణాలు మధ్యాహ్నం వరకే తెరిచి ఉంచాలని ఆ సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో ఈ విధానం అమలవుతుండగా సోమవారం నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా ఈ విధానం అమలు చేయనున్నట్టు దుకాణాదారుల సంఘం అధ్యక్షుడు ఎలగందుల మునీందర్ తెలిపారు. కరోనా కట్టడయ్యేంతవరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని దుకాణాలను మధ్యాహ్నం 2గంటలకు మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చుట్టు పక్కల గ్రామాల వారు కిరాణా సామగ్రి కోసం వచ్చినట్టయితే సాయంత్రానికల్లా వారి స్వగ్రామాలకు చేరే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నందున వ్యాపారులు కూడా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలనే ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు క్రయవిక్రయాలు జరపాలని నిర్ణయించామన్నారు. సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే రూ. 5వేల వరకు జరిమానా కూడా విధిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed