రసూల్‌పురలో షాపులు సీజ్

by Shyam |
రసూల్‌పురలో షాపులు సీజ్
X

దిశ, కంటోన్మెంట్: లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యాపారులపై కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం కొరడా ఝుళిపించింది. రసూల్‌పుర‌లో ద్రిష్టి అసోసియేట్స్, శాలీమార్ పుడ్స్ సంస్థలను శనివారం బోర్డు అధికారులు సీజ్ చేశారు. శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్, ఇన్ స్పెక్టర్ ఆకుల మహేందర్ సిబ్బందితో ఆయా షాపులను తనిఖీలు చేయగా లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కంటోన్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం సీజ్ చేసినట్లు దేవేందర్ తెలిపారు.

Advertisement

Next Story