- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు..!
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిగి మండలం గడిసింగాపూర్లో మృతి చెందిన వ్యక్తి రాకంచర్లకు చెందిన గోపాల్‌గా గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితం అత్తగారిల్లైన దిర్సంపల్లి తండాకు తన భార్యతో కలిసి వెళ్లాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన గోపాల్ ఒక్కరోజు దాటినా ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం గడిసింగాపూర్ సమీపంలోని చింతలచెరువు వద్ద శవమై తేలాడు.
గోపాల్ మద్యం సేవించి ప్రక్కనే పొలానికి వేసిన విద్యుత్ తీగకు చనిపోయినట్లు.. తమపైకి వస్తుందేమోనని గోపాల్ మృతదేహాన్ని గడిసింగాపూర్ సమీపంలో పడివేసినట్లు తెలుస్తోంది. నీ భర్త చనిపోయాడు, నీకు డబ్బులు ఇస్తాం ఎవ్వరికీ చెప్పొద్దని గోపాల్ భార్యను స్నేహితులు కోరినట్లు సమాచారం. మృతుడి కాళ్లపై విద్యుత్ తీగలు తగిలినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.