టీచర్‌కి, ఆర్ఎంపీకి కరోనా ఎలా సోకిందో తెలిస్తే షాకే..!

by srinivas |
టీచర్‌కి, ఆర్ఎంపీకి కరోనా ఎలా సోకిందో తెలిస్తే షాకే..!
X

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ఆసుపత్రుల్లోని ఐసోలేషన్, క్వారంటైన్ గదుల్లో భరించలేని ఏకాంతతను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు, మరోక టీచర్‌కి కరోనా సోకిన విధానం ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్‌లో కరెన్సీ నోట్లను ముట్టుకోవాలంటే భయంతో బిగుసుకుపోయే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ అని ఒక వ్యక్తికి తేలగానే.. వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నారు. వైద్యులు చికిత్సనందిస్తే.. పోలీసులు అతనికి కరోనా ఎలా సోకింది? అన్నదానిపై దృష్టిపెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో బయటపడ్డ రెండు కరోనా కేసుల పూర్వాపరాలు పరిశీలించి ఆశ్చర్యపోయారు. వీరిద్దరికీ విదేశీ ప్రయాణం రికార్డు లేదు. ఢిల్లీ వెళ్లిన రికార్డు కూడా లేదు. పోనీ ఢిల్లీ వెళ్లిన వారితో సంబంధాలు నెరపిన రికార్డు కూడా లేదు. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా, విస్తుపోయే వాస్తవం వెల్లడైంది.

వారిద్దరికీ కరెన్సీ నోట్ల కారణంగా కరోనా సోకి ఉంటుందని అంచనాకి వచ్చారు. దీంతో కరెన్సీ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వవద్దని, డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటున్న నేపథ్యంలో చేతితో చేసే లావాదేవీల కారణంగా సోకే ప్రమాదం ఉందని, అందుకే కంప్యూటర్‌ వాడకం, బాత్‌రూం, లిఫ్ట్‌ డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడం వంటి పనులు సురక్షిత ప్రదేశాల్లో చేయడంతో పాటు వెంటనే సబ్బుతో చేతులు కడుక్కుని, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు. క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తెలిపారు. అందుకే నగదు లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags: currency, money, cash, corona virus, covid-19, guntur, east godavari

Advertisement

Next Story

Most Viewed