- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్ కు షాక్.. అక్కడ కేటీఆర్ పర్యటన బహిష్కరణ
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంగళవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లుగా అలంపూర్ మున్సిపాలిటీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు. అలంపూర్ కు మంజూరు అయిన వంద పడకల ఆస్పత్రిని అలంపూర్ చౌరస్తాకు తరలించడం పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం వారు మీడియా సమావేశంలో వివరాలను ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ కు వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తే పలువురు నాయకులు వ్యూహాత్మకంగా అలంపూర్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరస్తా కు తరలించడం పట్ల గత రెండు నెలలుగా అలంపూర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరసనలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం అలంపూర్ బంద్ కూడా నిర్వహించారు. ప్రజల నుండి వస్తున్న నిరసనలు, అఖిలపక్ష కమిటీ నుండి వస్తున్న ఒత్తిడి మేరకు ప్రజా ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు గద్వాల జోగులాంబ జిల్లా లోనూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం కేటీఆర్ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. దీనితో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.