టీ 20 సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్

by Shiva |   ( Updated:2021-03-10 01:51:33.0  )
టీ 20 సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 12 నుంచి ఇంగ్లండ్‌తో టీ 20 సిరీస్ ప్రారంభం కానున్న క్రమంలో టీమిండియాకు షాక్ తగిలింది. కీలకమైన ముగ్గురు ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. బౌలర్లు నటరాజన్, వరుణ్ చక్రవర్తితో పాటు బ్యాట్స్‌మెట్ రాహుల్ తెవాటియా టీ 20 సిరీస్‌కు దూరం కానున్నారు. తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో ఈ ముగ్గురు యువ క్రికెటర్లు ఫెయిల్ అయినట్లు సమాచారం.

దీంతో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న టీ 20 సిరీస్‌లో ఈ ముగ్గురు క్రికెటర్లు ఆడటం కష్టమేనని తెలుస్తోంది. టెస్టు సిరీస్‌ను గెలుచుకుని నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి భారత్ అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌పై భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది.

అయితే టెస్టు సిరీస్‌లో ఓడిపోవడంతో.. టీ 20 సిరీస్‌నైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. గాయంతో ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ దూరం కావడం.. ఆ టీమ్‌కి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

Advertisement

Next Story