- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్‌లో కేటీఆర్‌కు షాక్.. మంత్రి పోస్టులపై ఎటాక్!
దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి స్థానంలో ఉండి కేటీఆర్ చేసిన ట్వీట్స్‌పై నెట్టింట్లో అభాసుపాలయ్యాయి. ఆయన ట్వీట్స్‌కు నెటిజన్లు రీట్వీట్స్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ కేటీఆర్ నోరెత్తకుండా బాణాలు సంధిస్తున్నారు. ఇంతకూ మంత్రి చేసిన ట్వీట్స్ ఏంటంటే..
సెప్టెంబర్ 9న సైదాబాద్‌లో జరిగిన హత్యాచార ఘటనపై సంబంధించి స్పందించిన కేటీఆర్.. ఆ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 14) వరకూ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తూనే ఉండటంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిందితుడిని ఎక్కడ పట్టుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
అదేవిధంగా కేటీఆర్ చేసిన మరో ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన చేసిన ట్వీట్‌లో వికారాబాద్‌కు చెందిన ఏరియల్ ఫొటో ఉంచి ‘‘ The beautiful Vikarabad area from the sky. Couldn’t resist clicking, With the mission mode focus on Harita Haaram & efforts to improve the irrigation potential through Mission Kakatiya & projects Telangana has turned green under the leadership of Hon’ble CM KCR Garu’’ అని పోస్ట్ చేశారు. అంటే సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన హరితహారం, నీటి వనరుల కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణ పచ్చదనంగా మారిందని, వికారాబాద్ ప్రాంతం ఏరియల్ వ్యూ ఎంతో అందంగా ఉందని, ఫొటో తీయకుండా ఉండలేమని దీని సారాంశం. అయితే దీనిపై కూడా నెటిజన్లు తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసురుతూ రీట్వీట్‌లు చేస్తున్నారు. అయితే దీనిపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
ఆ ట్వీట్.. ‘‘I can’t see any plantation related to #HarithaHaram throughout the way. Kalvakuntla Taraka Rama Rao – KTR Garu This is how you show heaven in the palm’’ అంటే కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రకారం.. హరితహారంతో పచ్చదనం పరిఢవిళ్లుతోందని చెప్పారు. అయితే ఆ ఫొటోలో పొలాలు తప్ప ఎక్కడా మొక్కలు, చెట్లు కనిపించడం లేదని, కేటీఆర్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారంటూ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. దీనిపై నెట్టింట చర్చ అవుతోంది. ‘‘చెట్లను పెట్టాం కానీ, కేసీఆర్ ఇచ్చిన గొర్లు తిన్నాయని, చెట్లు ఫామ్ హౌస్‌లో ఉన్నాయంటూ’’ కామెంట్లు చేస్తున్నారు.
I can't see any plantation related to #HarithaHaram throughout the way.
Kalvakuntla Taraka Rama Rao – KTR Garu This is how you show heaven in the palm… pic.twitter.com/BljBcQB36F
— Girish Daramoni (@daramonigirish) September 14, 2021