హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ.. RRR, భీమ్లా నాయక్‌కు కలిసొచ్చిన అవకాశం

by srinivas |   ( Updated:2021-12-14 05:56:49.0  )
హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ.. RRR, భీమ్లా నాయక్‌కు కలిసొచ్చిన అవకాశం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 35ను హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ల రేట్లు నిర్ణయించే వెసులుబాటు పిటిషనర్లకు ఉంటుందని స్పష్టం చేసింది. అందువల్ల టికెట్ల రేట్ల విషయంలో పాతవిధానం సరిగ్గానే ఉంది కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. ఇకపోతే మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు రేట్లు పెంచుకునే అవకాశం థియేటర్ల యాజమాన్యం.. బయ్యర్లకు ఉంటుందని వాదించారు. అందుకు ప్రేక్షకులు సైతం సిద్ధంగా ఉంటారని వాదించారు. ప్రేక్షకులు ఎవరూ టికెట్ల ధరలు పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నామని అనలేదని… కేవలం ప్రభుత్వం మాత్రమే అంటున్నదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ల తరపు వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం జీవో నంబర్ 35న రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పుతో ఆర్ఆర్ఆర్, పుష్ప, భీమ్లా నాయక్‌ మూవీలకు అదృష్టం కలిసొచ్చినట్లైంది. టికెట్ ధరలు పెంచుకునే అవకాశం రావడంతో కలెక్షన్లలో రికార్డు సృష్టించే అవకాశం లేకపోలేదు. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న ఈ మూవీలు థియేటర్లలో కలెక్షన్ల సునామీ కురిపించే అవకాశం లేకపోలేదని సినీ అభిమానులు పేర్కొంటున్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

సభపై సందిగ్ధం: అమరావతి రైతుల పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ

Advertisement

Next Story

Most Viewed