దుబ్బాకలో కాంగ్రెస్‎కు షాక్

by Anukaran |   ( Updated:2020-10-09 05:02:40.0  )
దుబ్బాకలో కాంగ్రెస్‎కు షాక్
X

దిశ, వెబ్‎డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికల ముందుకు కాంగ్రెస్‎కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్‎లో ఆశించిన టిక్కెట్ రాకపోవడంతో ఇద్దరు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‎లో మంత్రి హరీష్‎రావు సమక్షంలో కాంగ్రెస్ నేతలు వెంకట నర్సింహారెడ్డి, బొంపల్లి మనోహర్ రావు గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నర్సింహారెడ్డి, మనోహర్ రెడ్డి టీఆర్ఎస్‎లో చేరడంతో దుబ్బాకలో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు. దుబ్బాకలో తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యేగా కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో 7 లక్షల పెళ్లిళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా సహాయం చేసిందని తెలిపారు.

Advertisement

Next Story