- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లేట్ భోజనం చేయండి.. లక్షన్నర బుల్లెట్ బైక్‌ను ఫ్రీగా పొందండి
దిశ,వెబ్‌డెస్క్: మీరు మాంచి భోజన ప్రియులా అయితే ఇంకెందుకాలస్యం బుల్లెట్ థాలి తినండి లక్షన్నర విలువ చేసే బుల్లెట్ బైక్ ను సొంతం చేసుకోండి. అదేంటీ రూ.2,500 బుల్లెట్ థాలి భోజనంతో లక్షన్నర బైక్ ను ఎలా సొంతం చేసుకోవచ్చనే డౌట్ రావొచ్చు. డౌట్ కాదండోయ్ అక్షరాల నిజం.
ముంబై – పూణే హైవేలో హోటల్ శివరాజ్ అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ యజమాని కష్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటారు. తాజాగా బుల్లెట్ థాలి పేరుతో ఓ ఆఫర్ ప్రకటించారు. ఆ ఆఫర్ లో భాగంగా హోటల్ సిబ్బంది మనకు ఓ ప్లేట్లో సుర్మై ఫ్రై, పోమ్‌ఫ్రేట్ ఫిష్ ఫ్రై, రొయ్యల బిర్యానీ, సోల్ కడి, చికెన్ సుక్కా, డ్రై మటన్, మటన్ మసాలా పేరుతో 12రకాల వెరైటీ డిషెస్ ను అందిస్తారు. 60 నిమిషాల్లో ప్లేట్లో ఉన్న డిషెస్ అన్నీ లాగించేయాలి. అలా చేసిన వారికి బుల్లెట్ బైక్ ను ఉచితంగా అందిస్తాడు ఆ హోటల్ యజమాని. ఇప్పుడే కాదు గతంలో 8కేజీల రావన్ థాలీ అనే ఆఫర్ ను అందించారు. ఈ ఆఫర్ లో గెలిచిన కష్టమర్లకు రూ.5వేలు బహుమతిగా అందజేసింది హోటల్ యాజమాన్యం. కరోనా కారణంగా హోటల్ శివరాజ్ మూతపడి.., ఇటీవలే ఓపెన్ అయ్యింది. కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ భారీ ఆఫర్ ను ప్రకటించింది హోటల్ శివరాజ్ యాజమాన్యం. మరి ఇంకెందుకు ఆలస్యం ఓసారి ట్రై చేయండి. బుల్లెట్ బైక్ ను సొంతం చేసుకోండి.