- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెగాసస్‌పై పార్లమెంట్‌లో ప్రధాని క్లారిటీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ స్పైవేర్ ‘పెగాసస్’ను ఉపయోగించి దేశంలోని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై నిఘా వేశారని వస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం డిమాండ్ చేశారు. దాని వాడకంపై ప్రధాని పార్లమెంట్‌లో స్పష్టం చేయాలని సూచించారు. దేశంలో పెగాసస్ ప్రకంపనలపై చిదంబరం ఓ జాతీయ మీడియాకు ఆదివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పెగాసస్’ ఆరోపణలపై కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని కోరారు. భారత్ పెగాసస్‌ను వాడలేదని ఐటీ, కమ్యూనికేషన్స్ మినిస్టర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటివరకు చెప్పలేదని, ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలనూ ఖండించలేదన్నారు. పెగాసస్ ఆరోపణలపై ఇజ్రాయిల్ దర్యాప్తునకు ఆదేశించిందని, కానీ, భారత్ ఎందుకు విచారణ చేపట్టట్లేదని ప్రశ్నించారు.
స్నూపింగ్‌కు నిధులెవరిచ్చారు: సంజయ్ రౌత్
పెగాసస్‌ను ఉపయోగించి రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై నిఘా వేయడానికి నిధులు ఎవరిచ్చారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. పెగాసస్ తయారీదారైన ఎన్ఎస్ఓ ఒక్కో లైసెన్స్‌కు ఏడాదికి రూ.60కోట్లు వసూలు చేస్తుందని, ఈ లైసెన్స్‌తో 50ఫోన్లను హ్యాక్ చేయొచ్చని తెలిపారు. తాజా నివేదిక ప్రకారం భారత్‌లో 300 ఫోన్లు ట్యాప్ చేశారని, అందుకోసం ఆరు నుంచి ఏడు లైసెన్స్‌లు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇందుకోసం ఏడాదికి కనీసం రూ.300కోట్లు అవసరమవుతాయని వివరించారు. ఇంత మొత్తాన్ని ఎవరు భరిస్తున్నారని నిలదీశారు. పైగా, పెగాసస్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని ఎన్ఎస్‌ఓ చెబుతున్నదని, అలా అయితే, భారత్‌లోని ఏ ప్రభుత్వం దాన్ని కొన్నదని సామ్న పత్రికలో ప్రశ్నించారు. అంతేకాకుడా, స్పైవేర్ దాడిని హిరోషిమాపై అణుబాంబు వేయడంతో పోల్చారు. అణుబాంబు దాడిలో ప్రజలు మరణిస్తే, స్పైవేర్ అటాక్‌తో ప్రజాస్వామ్యమే మరణించే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.