‘దేశంలో మోడీ టాప్ లీడర్’

by Shamantha N |   ( Updated:2021-06-10 11:07:39.0  )
Shiv Sena MP Sanjay Raut
X

ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖాముఖిగా ఇటీవలే భేటీ తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీ దేశంలోనే టాప్ లీడర్ అని, బీజేపీలోనూ అగ్రనేత అని కితాబిచ్చారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక నేతలనే ఆర్ఎస్ఎస్ ముందుంచుతున్న తరుణంలో మోడీకి ఛరిష్మా తగ్గిందన్న కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై రౌత్ స్పందనను కోరగా ‘ఈ విషయంపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. మీడియా రిపోర్టులను నేను పరిగణించను.

ఆయన పట్టుతగ్గుందనడంపై అధికారిక ప్రకటనలు లేవు. ఈ ఏడేళ్ల కాలంలో బీజేపీ విజయాలకు మోడీనే కారణం. నేడు దేశంలో ఆయనే టాప్ లీడర్. బీజేపీలోనే ఆయనే అగ్రనేత’ అని అన్నారు. ‘ప్రధానమంత్రి ఒక పార్టీకి పరిమితమని శివసేన భావించదు. అందుకే ఎన్నికల క్యాంపెయిన్ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే ప్రధాని ప్రమేయంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది’ అని తెలిపారు.

Advertisement

Next Story