పోర్నోగ్రఫీ కేసులో ఎట్టకేలకు స్పందించిన శిల్పా శెట్టి

by Shyam |
పోర్నోగ్రఫీ కేసులో ఎట్టకేలకు స్పందించిన శిల్పా శెట్టి
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు గురించి స్పందించింది. వారం రోజుల క్రితం మీడియా సంస్థలపై పరువునష్టం దావా కేసు వేసిన ఆమె.. తనకు, తన కుటుంబానికి ప్రైవసీ కావాలని మీడియాను కోరింది. ఎన్నో ఆరోపణలు, పుకార్ల నడుమ గత కొన్ని రోజులుగా సవాళ్లను ఎదుర్కొంటున్నామని, తనకు మాత్రమే కాదు తన కుటుంబానికి కూడా ట్రోల్స్ ఎదురైనా.. ఇప్పటి వరకు తాను ఎలాంటి కామెంట్ చేయలేదని చెప్పింది.

ఇప్పటికైనా తమ గురించి తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని, ముంబై పోలీసులు, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని తెలిపింది. రాజ్ కుంద్రా ఫ్యామిలీ మెంబర్‌గా తన గురించి అన్ని చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయిస్తున్నామన్న శిల్పా.. తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిగా తమకు ప్రైవసీ కావాలని వినయంగా అభ్యర్థిస్తున్నానని, ఎలాంటి ధృవీకరణ లేని ఇలాంటి హాఫ్ బేక్డ్ ఇన్‌ఫర్మేషన్‌ను ప్రసారం చేయకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయ చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా ఇండస్ట్రీలో 29ఏళ్లుగా కష్టపడుతున్నానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని తెలిపింది. దయచేసి మీడియా తన ఫ్యామిలీ ప్రైవసీ హక్కును గౌరవించాలని, నిజానిజాలను నిర్ధారించేందుకు చట్టం ఉందని వివరించింది శిల్పా.

Fallow disha cinema facebook page: https://www.facebook.com/Dishacinema

Advertisement

Next Story