- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్పీల కోసం నా కొడుకును చంపేస్తారా? : సింగర్ ఆవేదన
దిశ, సినిమా : ఓ న్యూస్ చానల్ చేసిన పనికి తను, తన భార్య వెయ్యిసార్లు మరణించామని బాలీవుడ్ సింగర్, యాక్టర్ శేఖర్ సుమన్ బాధపడ్డారు. తన కొడుకు అధ్యాయన్ సుమన్ సూసైడ్ చేసుకున్నాడన్న ఫేక్ న్యూస్‌తో తల్లడిల్లిపోయామని తెలిపారు. అధ్యాయన్ గతంలో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసి ఉండగా.. ఇలాంటి న్యూస్ రావడంతో కుటుంబం మొత్తం నిజమే అనుకుని ఏడ్చేశామన్నారు. అధ్యాయన్ ఢిల్లీలో ఉంటాడని.. తన ఫోన్ కూడా ఆ సమయంలో రీచ్ కాకపోవడంతో భయపడిపోయామని చెప్పారు. కానీ తనను చూశాక మనసు కుదుటపడిందన్న శేఖర్.. ఇప్పటికే ఓ కొడుకును కోల్పోయిన తాము, మరో కొడుకు పోయాడన్న ఫేక్ న్యూస్ చూసి ఎంత క్షోభ అనుభవించి ఉంటామో అర్థం చేసుకోవాలన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వార్తలు ప్రచురించిన ‘జీ న్యూస్’ చానల్ యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్పీల కోసం మనుషుల జీవితాలతో ఆడుకోకూడదని.. మీడియా చానల్స్ రియలైజ్ అయ్యేలా పనిష్మెంట్ ఉండాలన్నారు.
Yday@ZeeNews sent out a piece of news which devastated all of us.They said that Adhyayan Suman has committed suicide.Adhyayan was in Delhi and was unreachable and we all died a thousand deaths.Such a shocking news cld have had a disastrous effect.
— Shekhar Suman (@shekharsuman7) February 21, 2021
సదరు చానల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన శేఖర్ సుమన్.. జీన్యూస్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఐటీ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్, హోం మినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్‌లను ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.
While a demand an immediate public apology from @ZeeNews I request the I&T minister @PrakashJavdekar @Maha CM @OfficeofUT @AnilDeshmukhNCP to take strict legal action against @ZeeNews for such an irresponsible and reprehensible act.
— Shekhar Suman (@shekharsuman7) February 21, 2021
We are aghast and still not come out of the shock.I request ev one to tweet against such an unpardonable behavior of @ZeeNews and ban the channel lest it happens to anyone https://t.co/tf2uzjnsLz going ahead and taking a suitable legal action them. pic.twitter.com/vqpZAkI0H7
— Shekhar Suman (@shekharsuman7) February 21, 2021