- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిజ్రాలను ఆదుకుందాం: శేఖర్ కమ్ముల
ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఈ కష్ట కాలంలో తనదైన శైలిలో సహాయం అందిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జీహెచ్ఎంసీ, కర్నూలు పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటీవలే బాదం పాలు, మజ్జిగ అందజేసిన శేఖర్ కమ్ముల.. వారి నుంచి అభినందనలు అందుకున్నారు. అదే స్ఫూర్తితో మరిన్ని సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో సమాజంలో ఎన్నో కష్టాలెదుర్కొంటున్న హిజ్రాలకు తన వంతు సాయాన్ని అందించారు. లాక్‌డౌన్ కారణంగా వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణించలేమని.. కూడు, గూడులేని వారి బాధలు చూస్తుంటే కన్నీళ్లు ఆగవన్నారు. కనీసం ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా అంటే అది కూడా లేదన్నారు. అడ్రస్ లేని వారికి సాయమెలా అందుతుందని ప్రశ్నిస్తున్న శేఖర్ కమ్ముల.. హిజ్రాలకు నిత్యావసర సరుకులు అందించారు. ‘దయచేసి వారి బాధను అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని చిన్న చూపు చూడకుండా ఆదుకోవడం మన బాధ్యత’ అని తెలిపారు.