- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధార్థ్ శుక్లాకు ప్రేయసి షెహనాజ్ భావోద్వేగ నివాళి.. స్పెషల్ సాంగ్ రిలీజ్
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా రెండు నెలల క్రితం హార్ట్ ఎటాక్‌తో మరణించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్14 షో ద్వారా భారీ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్.. అదే టైమ్‌లో కో-కంటెస్టెంట్ షెహనాజ్ గిల్‌తో క్లోజ్ రిలేషన్ మెయింటెన్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ రిలేషన్ కొనసాగగా… స్వీట్ కపుల్స్‌గా ఇండస్ట్రీని ఏలేందుకు సిద్ధమైన సిద్‌నాజ్ కలయికలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కాకుండా సిద్ కన్నుమూశాడు. దీంతో పూర్తిగా కుంగిపోయిన షెహనాజ్.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్‌తో తన లవ్ జర్నీ అండ్ మెమొరీస్‌ను గుర్తుచేసుకుంటూ ట్రిబ్యూట్ సాంగ్ రిలీజ్ చేసింది.
https://t.co/5nMmlDqk4F @sidharth_shukla
— Shehnaaz Gill (@ishehnaaz_gill) October 29, 2021
ఈ పాటను జ్ రన్ జోధ్ రచించగా.. షెహనాజ్ స్వయంగా పాడింది. ‘మేరే దిల్‌ఖో బతాహే.. తూ యహీ హై(నా మనసు చెబుతుంది. నీవు ఇక్కడే నాతోనే ఉన్నావని)’ సాంగ్‌తో సిద్‌కు నివాళులు అర్పించింది. ‘నీవు లేవనే నిజాన్ని నా గుండె అంగీకరించట్లేదు. నీవు లేని ఈ లోకం నాకు శూన్యమే. నా జీవితమంతా చీకటి కమ్ముకున్నట్లుగా ఉంది. ప్రతీ సెకను, ప్రతీ రాత్రి నాకొక నరకంగా గడుస్తోంది. మళ్లీ నీతో గడపాలని ఉంది. నా కోసం మళ్లీ తిరిగి వస్తావా? మళ్లీ మనం ఇద్దరం కలిసి జీవిస్తామా?’ అంటూ తనతో గడిపిన క్షణాలను ఈ వీడియోలో పొందుపరిచింది. కాగా ఈ పాటలో చివరగా షెహనాజ్.. అంటూ సిద్ధార్థ్ గట్టిగా పిలవడం అభిమానుల హృదయాలను కదిలిస్తుంది.