బలవంతంగా మైనర్‌కు పెళ్లి.. మండపంలో బంధువులకు షాకిచ్చిన పోలీసులు

by Sridhar Babu |   ( Updated:2021-08-18 02:32:36.0  )
Bride Refusing to Marry Groom with Bad Eyesight
X

దిశ, రాజేంద్రనగర్ : బలవతంగా మైనర్ బాలికకు వివాహం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 17 సంవత్సరాల మైనర్ బాలికకు బలవంతంగా వివాహం చేస్తున్నారని పక్కా సమాచారం రావడంతో బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అత్తాపూర్ పరిధిలోని, మేరా ఫంక్షన్ హాల్లో షీ టీమ్ పోలీసులు దాడులు నిర్వహించాయి. మైనర్ బాలికను, కుటుంబ సభ్యులను, పెళ్ళికి సహకరించిన బంధువులను రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story