- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి ఆమె ముందంజ..
దిశ, కరీంనగర్:
రాష్ట్రంలోని మిగతా ప్రజాప్రతినిధుల్లాగే ఆమె ఓ ప్రజాప్రతినిధి. రొటీన్‌గా ఆమె కూడా ఏవో రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఇంటికే పరిమితం కావచ్చు. కానీ, ఆమె అలా చేయడం లేదు. స్వయంగా రంగంలోకి దిగి కరోనా మహమ్మారి కట్టడికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆమె ఎవరో కాదండీ..మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ.
వార్డుకో కమిటీ నియామకం..
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు భార్య శైలజ గతంలో మంథని పంచాయతీ సర్పంచ్‌గా సేవలందించారు. ఇటీవల మున్సిపాలిటీగా మారిన తర్వాత మంథని మున్సిపల్ తొలి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రబలుతున్నదని తెలిసిన వెంటనే ఆమె రంగంలోకి దిగారు. జనతా కర్ఫ్యూ కంటే ముందే పట్టణంలో ప్రజలకు పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ రోజున ఆమె స్వయంగా వీధుల్లో తిరుగుతూ రోడ్లపైకి రావద్దంటూ సూచనలు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత వార్డుకో కమిటీని నియమించారు. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా వారికి కావల్సిన అవసరాలు తీర్చే బాధ్యతలను ఆ కమిటీలకు అప్పగించారు. పట్టణంలోని 13 వార్డుల్లో నలుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలే ఆయా కాలనీల ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. శైలజ స్వయంగా పట్టణంలో తిరుగుతూ ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు, పోలీసులకు మాస్కుల పంపిణీ..
విద్యార్థులకు శుభ్రతపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పిస్తున్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు మంథనిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. పట్టణ ప్రజలతోపాటు, పోలీసులకు కూడా మాస్క్‌లను పంపిణీ చేశారు. లాక్ డౌన్ పొడిగించిన తర్వాత తన భర్త పుట్ట మధుతో కలసి శైలజ పట్టణంలో తిరుగుతున్నారు. జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇద్దరూ వీధుల్లో బైక్‌లపై తిరుగుతూ ప్రజల అవసరాలను తెలుసుకోవడంతో పాటు వారి అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, లాక్ డౌన్ ఎక్స్‌టెన్షన్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించే నాటికే వీరిద్దరూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం నింపడంలో నిమగ్నమవడం విశేషం.
Tags: orona virus (covid-19), prevention methods, manthani, masks distribution, awareness programmes