‘శశి’ రిలీజ్ డేట్ ఖరారు..‘ఆది’కి బ్రేక్ ఇచ్చేనా?

by Jakkula Samataha |
‘శశి’ రిలీజ్ డేట్ ఖరారు..‘ఆది’కి బ్రేక్ ఇచ్చేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆది సాయి కుమార్, సురభి జంటగా నటించిన ‘శశి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. టీజర్‌తోనే చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేసిన మూవీ యూనిట్.. ఫిబ్రవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు అరుణ్ చిలువేరు అందించిన మ్యూజిక్ ఆకట్టుకోగా..ఆర్‌.పి.వ‌ర్మ‌, సి.రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపకుంటోంది. కచ్చితంగా ఈ సినిమా ఆదికి బ్రేక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దర్శక నిర్మాతలు.

Advertisement

Next Story