- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత క్రికెట్‌ను నాశనం చేసి పారిపోయాడు
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్‌కు నష్టం చేకూర్చి పారిపోయాడని ఐసీసీ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్‌ను ఉద్దేశించి బీసీసీఐ మాజీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఐసీసీ చైర్మన్ పదవి నుంచి బుధవారం శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. తన దీర్ఘకాలిక శత్రువుగా భావించే శశాంక్ పదవీ విరమణ చేయడాన్ని ‘మంచి పరిణామం’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. బీసీసీఐ కష్టాల్లో ఉన్న సమయంలో అధ్యక్ష పదవిని వదిలేసి ఐసీసీ చైర్మన్ పీఠాన్ని అధిష్టించాడని, భారత్‌లో తన ఆటలిక చెల్లవనే పారిపోయాడని శ్రీనివాసన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. బీసీసీఐకి ఎవరూ చేయనంత నష్టాన్ని శశాంక్ చేశాడని, ఐసీసీ చైర్మన్ అయ్యాక కూడా కొనసాగించాడని శ్రీనివాసన్ ఆరోపించారు. భారత క్రికెట్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా పలు నిర్ణయాలు తీసుకున్నాడని, ఐసీసీ చైర్మన్‌గా అతను తీసుకున్న ప్రతీ నిర్ణయం బీసీసీఐని దెబ్బ తీసిందని శ్రీనివాసన్ చెప్పారు. అతను ఐసీసీ పీఠాన్ని అధిష్టించడానికి బీసీసీఐని ఒక పావులా వాడుకున్నాడని ఆరోపించారు.