- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంకీ కథ.. శర్వాకు ఓకే?
హీరో శర్వానంద్ ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకు ఎప్పుడూ వెనుకాడడు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ.. స్టార్ హీరోలతో పోటీగా సినిమా రిలీజ్ చేసి, హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు. కానీ ఈ మధ్య శర్వా ప్రయోగాలు వికటిస్తున్నాయి. అందుకే ఆచి తూచి సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు. కాగా, ఇప్పటికే శ్రీకారం మూవీ చేస్తున్న శర్వా.. తాజాగా మరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.
‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి’ వంటి సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కిశోర్ తిరుమలతో సినిమా చేయబోతున్నాడని టాక్. నిజానికి ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాను కిశోర్.. విక్టరీ వెంకటేష్‌తో చేయాల్సి ఉంది. కానీ వెంకీ అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ స్టోరీ కాస్త శర్వా దగ్గరకు వచ్చింది. కథ విన్న శర్వా ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండ్ హాఫ్‌లో మార్పులు చేయమని సూచించినట్టు సమాచారం. దీంతో సెకండ్ హాఫ్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట డైరెక్టర్.