1910 నుంచి 2021 కి ట్రావెల్ చేయనున్న శర్వా

by Shyam |
1910 నుంచి 2021 కి ట్రావెల్ చేయనున్న శర్వా
X

దిశ, వెబ్ డెస్క్: వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్న దర్శకుల్లో చందు మొండేటి ఒకరు. అలాగే భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. మంచి కథలతో ముందుకు వెళుతున్న నటుడు శర్వానంద్ . మరి వీరిద్దరు కలిసి ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ చేయబోతున్నారు. ప్రస్తుతం శ‌ర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్ క‌రోనా ప్ర‌భావంతో ఆగిపోయింది. దీని తర్వాత శర్వానంద్ చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్నారని సమాచారం. మనం సినిమాలో లానే 1910 నుంచి 2021 వరకు జరిగే ప్రేమకథ అని ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని స్వయంగా దర్శకులు చందూనే తెలిపారు. కార్తికేయ 2 కంటే అదే ముందు శర్వాతో ఈ సినిమా తీయాలని కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. టైమ్ పీరియడ్ మూవీ కావడం కథ పూర్తి వైవిధ్యభరితంగా ఉంటుందని చెబుతున్నారు. కథాకథనాల పరంగా .. కాస్ట్యూమ్స్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి ‘కార్తికేయ 2’ సినిమా పనులతో బిజీగా వున్నాడు. ఆ సినిమా విడుదలైన తరువాత ఆయన శర్వానంద్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడట. కొత్తదనం కోసం శర్వానంద్ చేసే ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

tags: sharwanand, chandoo mondeti, telugu cinema

Advertisement

Next Story

Most Viewed