- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాసంక్షేమానికి పాటుపడిన మహా నేత వైఎస్సార్ : షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : మహానాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
లోటస్ పాండ్‌లో జాబ్ మేళా
వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్ కన్వీనర్ ఇరుమళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరై మాట్లాడారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని, యువత కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్‌కు చెందిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబానికి జాబ్ మేళాలో సునీల్ నాయక్ తమ్ముడు బోడ శ్రీనివాస్ నాయక్‌కు ఉద్యోగం కల్పించారు.
రక్తదాన శిబిరం
తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్ షర్మిల పాల్గొని రక్తదానం చేశారు. యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు. అపోహలు వీడి బ్లడ్ డొనేట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ సభ్యులు, వుప్పల వెంకయ్య మెమోరియల్ బ్లడ్ బ్యాండ్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.