- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి బాటలో తనయ.. సెంటిమెంట్ ఫలించేనా ?
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్టీపీ చీఫ్షర్మిల బుధవారం నుంచి తెలంగాణ లో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తన తండ్రి సెంటిమెంట్‌గా భావించే చేవెళ్ల నుంచి యాత్రను చేపట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం షర్మిల భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అనంతరం చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సుమారు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు యాత్రను కొనసాగించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 పార్లమెంట్స్థానాల్లోని సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రభుత్వం నెరవేర్చని హామీలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలనే ఎక్కువగా ప్రస్తావించనున్నారు. దీంతో పాటు తన తండ్రి బాటలోనే వైస్సార్ టీపీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి వస్తాయో కూడా ఆమె వివరించనున్నారు.
- Tags
- chevella