టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల ఫైర్.. పతనం మొదలయ్యిందని హెచ్చరిక

by Shyam |   ( Updated:2021-10-05 04:11:19.0  )
టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల ఫైర్.. పతనం మొదలయ్యిందని హెచ్చరిక
X

దిశ, నిజామాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుని, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఫాంహౌస్ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి మంగళవారం జరిగే నిరుద్యోగుల నిరాహార దీక్షలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం తెలంగాణ యూనివర్సిటీ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని, ప్రతి యూనివర్సిటీలో అధ్యాపక సిబ్బంది వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్, కేటీఆర్ కు 2 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నారని, ఉన్నత విద్యా మండలి ఆదేశాలు బేఖాతరు చేస్తూ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా లక్షలు తీసుకొని ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారని ఆమె ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4% ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని, నిన్న అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ తెలపడం తెలంగాణ రాష్ట్రానికి అవమానమని షర్మిల తెలిపారు. ఆ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 16 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారా అని కేటీఆర్ ని సూటిగా ప్రశ్నించారు. నీ కుటుంబంలో ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించుకొని రాష్ట్ర నిరుద్యోగ యువతను గాలికి వదిలేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు వంద మంది నామినేషన్ వేయడానికి వెళితే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు తెలిసిందని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తో కేసీఆర్ పతనం మొదలవుతుందని షర్మిల వెల్లడించారు.

Advertisement

Next Story