ఫుల్‌గా తాగి రచ్చ చేసిన అమీర్ ఖాన్, మాధవన్

by Shyam |
ఫుల్‌గా తాగి రచ్చ చేసిన అమీర్ ఖాన్, మాధవన్
X

దిశ, సినిమా : 2009లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘3 ఇడియట్స్’ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన మూవీ ఫ్రెండ్‌షిప్ వాల్యూ, తల్లిదండ్రులు – పిల్లల మధ్య బాండింగ్ ఎలా ఉండాలనే విషయాలను వివరించింది. కాగా మ్యాడీ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ ఇన్సిడెంట్ గురించి వివరించాడు షర్మాన్. సినిమాలో రాజు, రాంచో, ఫర్హాన్ క్యారెక్టర్స్ వైరస్‌ పాత్రను తిట్టాల్సిన సీన్‌లో ఫుల్‌గా తాగి గొడవ చేయాల్సి ఉంటుందని.. అయితే అమీర్ నిజంగానే ముగ్గురం తాగి చేద్దామని సజెస్ట్ చేశాడని తెలిపాడు. దీనికి ముగ్గురం ఓకే అనుకున్నామన్న షర్మాన్.. మ్యాడీకి వేరే వర్క్ ఉండటం వల్ల లేట్‌గా రావడంతో అప్పటికే అమీర్, తాను డ్రింకింగ్ స్టార్ట్ చేశామని చెప్పాడు. మధ్యలో యాడ్ అయిన మాధవన్‌ను తాము అప్పటివరకు ఎంత తాగామో అంత ఒకేసారి తాగాలని చెప్పడంతో అలాగే చేశాడని తెలిపాడు. అయితే మాధవన్ ఎక్కువ తాగేవాడు కాదు కానీ ఆ రోజు మాత్రం ఫాస్ట్‌గా డ్రింక్ చేశాడని, సీన్‌ రెడీ అయ్యేటప్పటికి అందరికీ ఎక్కువైపోయిందన్న షర్మాన్.. మ్యాడీ ఆ సీన్ బ్రిలియంట్‌గా చేశాడని తెలిపాడు.

Advertisement

Next Story