- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా నిధులను సేకరించిన షేర్‌చాట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ సంస్థ 502 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 3,730 కోట్ల నిధులను సేకరించింది. టైగర్‌గ్లోబల్, లైట్‌స్పీడ్, స్నాప్, ట్విటర్ ఇంకా ఇతర కంపెనీల నుంచి ఈ నిధులను సమీకరించినట్టు కంపెనీ తెలిపింది. ఈ నిధుల తర్వాత షేర్‌చాట్ కంపెనీ విలువ రూ. 15.6 వేల కోట్లకు పెరిగింది. ఈ నిధుల ద్వారా భారత్‌లో అతిపెద్ద ఏఐ ఆధారిత కంటెంట్‌ను రూపొందించేందుకు వినియోగించనున్నట్టు కంపెనీ పేర్కొంది. సంస్థ వృద్ధికి మద్దతు ఇచ్చిన పెట్టుబడిదారులకు షేర్‌చాట్ సహ-వ్యవస్థాపకుడు అంకుష్ సచ్‌దేవ కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం షేర్‌చాట్ నెలకు 16 కోట్ల మంది యాక్టివ్ వినియోగదారులను కలిగి ఉంది. దేశంలోని మొత్తం 15 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇటీవల కేంద్రం టిక్‌టాక్, హెలో వంటి చైనీస్ యాప్‌లను బహిష్కరించిన తర్వాత అనుబంధంగా మోజ్ యాప్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది.